నిరుద్యోగులు ఉద్యోగం పొందడంలో రెజ్యూమ్ ది కీలక పాత్ర. చాలామంది తమ రెజ్యూమ్ ను ఇతరుల కంటే ఆకర్షణీయంగా ఉండేలా చూసుకుంటారు. తాజాగా ఆదిత్య శర్మ అనే వ్యక్తి గూగుల్ ఫార్మాట్ లో తయారు చేసిన రెజ్యూమ్ నెట్టింట్ వైరల్ అవుతోంది. సెర్చ్ బార్, గూగుల్ డార్క్ థీమ్ తో చేసిన రెజ్యూమ్ లో తన విద్యార్హతతో పాటు స్కిల్స్ పొందుపరిచాడు. నిజంగా ఇది డిఫరెంట్ అని నెటిజన్లు స్పందిస్తున్నారు.