వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ కొత్తపాలెం గ్రామంలోని జగనన్న కాలనీ పక్కన అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్న వారిపై వేటపాలెం ఎస్సై జి సురేష్ శుక్రవారం మెరుపు దాడి చేశారు. ఆ సమయంలో రెండు టైరు బళ్ళలో అక్రమంగా తవ్విన ఇసుకను లోడ్ చేసుకుని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ఇద్దరు ఆయనకు దొరికారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని టైరు బళ్ళను వేటపాలెం స్టేషన్ కు ఎస్ఐ సురేష్ తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa