ఏపీలోని రాజమండ్రిలో రైతులతో సీఫుడ్ ఎక్స్ పోర్టర్స్ సమావేశం నిర్వహించారు. ఆక్వా సంక్షోభం సమయంలో క్రాఫ్ హాలిడే కు వెళితే నష్టపోతామని సీఫుడ్ ఎక్స్ పోర్టర్స్ సూచించడంతో రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆక్వా రంగంలో క్రాఫ్ హాలిడే నిర్ణయాన్ని విరమించుకున్నారు. సీఫుడ్ ఎక్స్ పోర్టర్స్ నిర్వహించిన ఈ సమావేశానికి 70 మంది ఎక్స్ పోర్టర్లు, గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన 300 మంది రైతులు హాజరయ్యారు.