గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో బ్యూటిషియన్ స్వాతి తన భర్త కోటేశ్వర్ రావు చేతిలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. స్వాతికి మరో యువకునితో ఎఫైర్ ఉందని కోటేశ్వర్ రావు కొన్నాళ్లుగా అనుమానిస్తున్నాడు. వారికి తరచు గొడవలు జరిగేవని తెలుస్తోంది. అనుమానం, ప్లాట్ అమ్మకపోవడం కారణాలతో ఆమెను హత్య చేసినట్టుగా సమాచారం.