గంగవరం మండలం దండపల్లి పంచాయతీ, నాగిరెడ్డిపల్లిలో నిర్వహించిన "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో శుక్రవారం ఎమ్మెల్యే ఎన్. వెంకటేగౌడా తో జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్నారు. జగనన్న ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాలు-సంక్షేమ పలాలను లబ్ధిదారులకు వివరించారు. అధికారుల దృష్టికి వచ్చినటువంటి సమస్యలను తక్షణమే పరిశీలించి ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని స్థానిక ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ హేమంత్ రెడ్డి, ఎంపీపీ వెంకటరమణ, జడ్పీటీసీ పార్వతి, కన్వీనర్ మోహన్ రెడ్డి, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు గిరిరాజారెడ్డి, చెంగారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.