పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం, దండపల్లి జడ్పి ఉన్నత పాఠశాలను జడ్పిచైర్మన్ జి. శ్రీనివాసులు శుక్రవారం సందర్శించినారు. పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు అభివృద్ధి పనులను పరిశీలించి, నాణ్యత ప్రమాణాలు పాటించి నిర్మాణ పనులు చేప్పట్టాలని సూచించారు. విద్యార్థులతో సంభాషించి విద్యా బోధన, భోజన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అందులో భాగంగా ఉపాధ్యాయులు జడ్పిచైర్మన్ ని దుశ్శాలువ పుష్పఉచ్ఛం తో సన్మానించారు. కార్యక్రరంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ హేమంత్ రెడ్డి, నాయకులు చెంగారెడ్డి , ఇతర నాయకులు, హెచ్. ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.