పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకరరావు శుక్రవారం పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు మండలంలో పర్యటిస్తారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి దర్శి వెంకటేశ్వరావు ప్రకటనలో తెలిపారు. క్రోసూరు మండలంలో జరిగే పలు కార్యక్రమాలలో పలు గ్రామాలలో పాల్గొంటారని ఆయన వివరించారు. క్రోసూరు మండలంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సానుభూతిపరులు వాలంటీర్లు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.