జొమాటో సహ వ్యవస్థాపకుడు మోహిత్ గుప్తా రాజీనామా చేశారు. నాలుగున్నరేళ్లుగా సంస్థకు సేవలందించిన ఆయన శుక్రవారం సంస్థకు రాజీనామా చేశారు. ఆయనతో పాటు ఇటీవల ముగ్గురు ప్రముఖులు ఆ సంస్థకు రాజీనామా చేశారు. ఫుడ్ డెలివరీ విభాగం మాజీ హెడ్ రాహుల్ గంజు, ఇంటర్సిటీ లెజెండ్స్ సర్వీస్ హెడ్ సిద్ధార్థ్ జువార్ కూడా రాజీనామా చేశారు.