శింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రానికి చెందిన షేక్ చాందుబాషా కుమార్తె వివాహంనకు శనివారం ముంటిమడుగు బ్రదర్స్ పదివేల ఆర్థిక సహాయం అందించారు. శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమాడుగు కేశవరెడ్డి మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం ఎంతో సంతోషకరమని తెలియజేశారు. వారి వైవాహిక జీవితం ఆనందంగా, సుఖ, సంతోషాలతో ఉండాలని తెలియజేశారు.