పెరూలోని జార్జ్ ఛావేజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ప్రమాదం జరిగింది. LATAM ఎయిర్ లైన్స్ విమానం రన్‌వేపై టేకాఫ్ అవుతుండగా ప్రమాదవశాత్తూ అగ్నిమాపక ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మరణించారు. ఆ సమయంలో విమానంలో 102 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. వారెవరికీ గాయాలు కాలేదని, అంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.