రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ ఆవరణలోని ద్విచక్ర వాహనాలను ఈనెల 21న వేలం వేస్తున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. వివిధ కేసుల్లో పట్టుబడిన వివిధ రకాలైన 35 ద్విచక్ర వాహనాలకు సంబంధించి ఈ వేలం పాట నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. రాయచోటి జిల్లా వ్యాప్తంగా ఆసక్తి కలిగిన ప్రజలు, వ్యాపారులు వేలం పాటలో పాల్గొని ప్రభుత్వ నిబంధనల మేరకు వాహనాలను దక్కించుకోవచ్చని సిఐ కోరారు.