పర్చూరు మండలం గొల్లపూడి విఆర్వో నాగమణి ఆత్మహత్య తో ఆమె స్వగ్రామమైన కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం ఉదయం నాగలక్ష్మి చీరాల రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో రైలు ఎదురుగా నిలబడి ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. పుట్టి పెరిగిందే గాక వివాహం అనంతరం కూడా నాగలక్ష్మి స్వగ్రామంలోనే భర్త, పిల్లలతో కలిసి ఉంటోంది. రోజు తమకు కనిపించే నాగలక్ష్మి ఇక లేదని గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. అందరితో కలిసి మెలిసి ఉండే నాగలక్ష్మి చాలా మంచిదని కూడా గ్రామస్తులు ముక్తకంఠంతో చెప్పారు. ఏ కష్టం వచ్చి నాగలక్ష్మి ఇంత కఠోర నిర్ణయం తీసుకుందా అన్న విషయమై గ్రామంలో చర్చ జరుగుతోంది.