పాదాలకు పగుళ్లు పెరగకూడదంటే పాదాలను శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. చలికాలంలో మడమలు పగలడం సహజం. చర్మంలో తేమ స్థాయి తగ్గితే మడమల పగుళ్లు వస్తాయి. రాత్రిపూట నిద్రపోయే ముందు రోజూ క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. పెట్రోలియం జెల్లీ రాసుకున్నా ఫలితం ఉంటుంది. పాదాలకు కొబ్బరి నూనె లేదా బాదం నూనెతో మర్దన చేసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్- ఇ ఎక్కువగా ఉండే ఆహారం తినడం మంచిది.