జీడిపప్పులో ఎన్నో పోషకాలు దాగున్నాయి. వాస్తవానికి చాలా మంది జీడిపప్పును ఇష్టంగా తింటుంటారు. ఎందుకంటే ఇవి రుచిగా ఉంటాయి. అయితే, జీడి పప్పు తింటే బరువు పెరుగుతారని, అందుకే బరువు తగ్గాలనుకునే వారు తినొద్దంటూ చాలామంది అంటుంటారు. కానీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం జీడిపప్పు తింటే బరువు తగ్గుతారు. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం మంచిదని, క్రమంగా శరీరం ఫిట్‌గా మారుతుందని పేర్కొంటున్నారు.