నటి, బీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యురాలు ఖుష్బూకి డీఎంకే అధికారిక దినపత్రిక ‘మురసొలి’ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే వాటికి సరైన సమాధానాలు కూడా వస్తాయని హెచ్చరించింది. రాజకీయాల్లోకి వచ్చిన కొద్దికాలంలోనే అనేక పార్టీలు మారారంటూ ఆమెను ఫిరాయింపు తిలకం అని విమర్శించింది. డీఎంకే నిర్వాహకుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు స్టాలిన్ ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించింది.