అదనపు కట్నం కోసం వివాహితను వేధింపులకు గురిచేస్తున్న భర్త, అత్తింటివారిపై నెల్లూరు వేదాయపాళెం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు నెల్లూరు బుజబుజనెల్లూరుకు చెందిన లావణ్యకు ఏడాది కిందట చేజర్ల మండలానికి చెందిన వెంగళరావుతో వివాహం జరిగింది. వివాహ సమయంలో లావణ్య తల్లి దండ్రులు 40 సవర్ల బంగారు ఆభరణాలు, రూ. 10 లక్షల నగదు ఇచ్చారు. వివాహానంతరం వెంగళరావు విజయవాడలో కాపురం పెట్టి అక్కడే ప్రైవేటు వైద్యశాలలో పనిచేస్తుండేవాడు. కొంతకాలంగా భర్త, అత్తింటివారు ఆమెను అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ మేరకు బాధితురాలు లావణ్య వేదాయపాళెం పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రమ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.