రష్యాకు చెందిన సఖాలిన్ ద్వీపంలో శనివారం ఘోరప్రమాదం జరిగింది. 20 కిలోల గ్యాస్ సిలిండర్ పేలి 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 9 మంది చనిపోగా, మరొకరు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటనపై ఆ ప్రాంత గవర్నర్ వాలెరీ లిమరెంకో స్పందించారు. 30 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని వివరించారు. శిథిలాల్లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడేందకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.