టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ కు ఓపెనింగ్ చేసే అవకాశం ఇవ్వాలని టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ అన్నాడు. పవర్ ప్లే లో ఫీల్డింగ్ నిబంధనలను ఉపయోగించుకొని షాట్లు ఆడగలిగే సత్తా పంత్ కు ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు. బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని వారిపై ఒత్తిడి పెంచేందుకు పంత్ ఇష్టపడతాడని అన్నాడు. పంత్ కొన్నిసార్లు వైఫల్యమైన మాట వాస్తవమేనని, కానీ అతడు అద్భుతమైన ఆటగాడని ప్రశంసలు కురిపించారు.