రాజకీయాలకు కాస్త దూరంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శంషాబాద్ లోని ఫాంహౌస్ లో ఉల్లాసంగా గడిపారు. ఈ ఫామ్ లో ఉన్న ఓ అరుదైన తెల్ల కొండచిలువను మెడలో వేసుకుని ప్రదర్శించారు. మరికొన్ని చిన్న కొండచిలువలను చేత్తో పట్టుకున్నారు. వాటిని ఆసక్తికగా పరిశీలించారు. అంతేకాదు, ఓ భారీ సాలీడును కూడా తన చేతిపైకి ఎక్కించుకున్నారు. ఈ ఫాంహౌస్ లో రంగురంగుల మకావు చిలుకలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలను విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు. వివిధ జీవజాతులు వైవిధ్యభరితమైన సౌందర్యాన్ని ఆసక్తిగా గమనించడం తనకు వినోదాన్నిస్తుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa