ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటైన తమిళ్ కు భారతదేశం పుట్టిల్లు అని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. అందుకు మనమంతా గర్వించాలని, ఆ భాష పరిరక్షణకు మరింతగా కృషి చేయాలని పేర్కొన్నారు. కాశీ-తమిళ్ సంగమం గంగ, యమున అంత పవిత్రమైనదని అభివర్ణించారు. ఇదిలావుంటే
దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలను పురాతన సంస్కృతి, జ్ఞానం తదితర అంశాల ద్వారా అనుసంధానించే లక్ష్యంతో కాశీ-తమిళ్ సంగమం కార్యాచరణ ఏర్పాటు చేసిన సంగత తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం-ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ వేడుకలు నెల రోజుల పాటు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో, ప్రతిష్ఠాత్మక కాశీ-తమిళ్ సంగమాన్ని ప్రధాని మోదీ నేడు ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మోదీ తమిళ సంస్కృతిని ప్రతిబింబించే వేషధారణలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మ్యాస్ట్రో ఇళయరాజా కూడా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa