జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా బిజ్బెహరా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదుల నుంచి కాల్పులు జరగడంతో బలగాలు ఎదురుకాల్పులకు పాల్పడ్డాయి. కాగా.. లోయలో లక్షిత హత్యల నేపథ్యంలో భద్రతా బలగాలు నిఘాను పెంచాయి. కాల్పుల్లో చనిపోయిన ఉగ్రవాది సజ్జాన్ తంత్రేపై కశ్మీర్ లో నాన్ లోకల్స్ ను చంపిన కేసులున్నాయని పోలీసులు తెలిపారు.