ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెనుక ఉన్నది తాడేపల్లి గ్యాంగ్ అని భయటపెట్టేశావ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 20, 2022, 01:43 PM

టీడీపీ నేత బుద్ద వెంకన్న  ట్విట్టర్  వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కి కౌంటర్ ఇచ్చారు. ‘‘ విసా రెడ్డి నువ్వు నిజంగా చదువు కున్నవా? కొన్నవా?.. నిన్నటి వరకూ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు నాకు ఏం సంబంధం అన్నావ్... ఇప్పుడు నిందితులకు మద్దతుగా ట్వీట్లు వేసి ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెనుక ఉన్నది తాడేపల్లి గ్యాంగ్ అని భయటపెట్టేశావ్.. స్పెషల్ ఫ్లైట్స్‌లో డబ్బు తరలించే అవకాశం పోయిందనే బాధ ఉండటంలో తప్పు లేదు కానీ జర్నలిస్టుల మీద పడి ఏడవటం ఎందుకు?.. మీడియాలో కుల కంపు తెచ్చింది మీ జగన్ రెడ్డే కదా మిత్రమా!, నిత్యం కుల, ప్రాంత, మత విద్వేషాలు రెచ్చగొడుతూ రోత రాతలు రాసే సా'ఛీ' పేపర్, ఛానల్‌లో పనిచేస్తున్న వారిలో స్ట్రింగర్లతో కలిపి 2039 మంది రెడ్డి సామాజిక వర్గం వారే.. ఇప్పుడు చెప్పు ఎవడిది కుల పిచ్చో.. రెడ్డి కాని ఒక్క జర్నలిస్టుకైనా మీ బ్లూ మీడియాలో స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఇవ్వలేదు కదా విజయసాయి రెడ్డి’’ అంటూ బుద్ద వెంకన్న ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com