కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముద్దనూరు మండలం చెన్నారెడ్డిపల్లె దగ్గర ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దంపతులతో సహా, ఆటో డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కొండాపురం మండలం దత్తాపురం గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు దస్తగిరి, సరస్వతి, ఆటో డ్రైవర్ ప్రేమ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు.