ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర నిస్పృహతో ఉన్నారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకులతో పాటు ప్రజలపై దాడికి పాల్పడటం అన్యాయమన్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబుకు ఇంత అసహనమా అని ప్రశ్నించారు. దత్తపుత్రుడు పవన్ మాదిరిగానే చంద్రబాబు కూడా నిన్న కర్నూలులో ఊగిపోయారని తప్పుపట్టారు. న్యాయ రాజధానిపై వైఖరి అడిగితే సమాధానం చెప్పాలన్నారు. వికేంద్రీకరణపై మాకు స్పష్టత ఉందని చెప్పారు. కర్నూలు వెళ్లినప్పుడు న్యాయ రాజధానిపైన ప్రజలు అడగరా అని ప్రశ్నించారు. ప్రజలు అడిగితే సమాధానం చెప్పకుండా బెదిరిస్తారిస్తా అని నిలదీశారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.