అధికారం అనే మానసిక వ్యాధి చంద్రబాబులో బాగా ముదిరిపోయింది. అంతచూస్తానని ఛాలెంజ్‌లు చేసిన వారంతా ప్రజాజీవితంలో అంతులేకుండా పోయారు. ఎవడి అంతు చూస్తావ్.. ఏం చేస్తావ్..? అని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. గబ్బిలాల రోజులు గతించాయని, రాజకీయంగా చంద్రబాబు, ఆయన పార్టీ అంపశయ్య మీద ఉన్నారు. ప్రజలు ఎప్పుడు ఆ వెంటిలేషన్ లాగేస్తారని ఎదురుచూడటం తప్ప చేసేది ఏమీ లేదు.. ఈసారి ఎన్నికలతో టీడీపీ శాశ్వత సమాధి కాబోతుంది అని అన్నారు. విశాఖలో స్పీకర్ తమ్మినేని సీతారాం విలేకరుల సమావేశం నిర్వహించారు.