హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మహ్సా అమినీ అనే 22 ఏళ్ల యువతి పోలీస్ కస్టడీలో చనిపోయినప్పటి నుంచి ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ నటి హెంగమెహ్ ఘజియాని తన హిజాబ్‌ను తీసేసి, నిరసన వ్యక్తం చేసింది. దీనిపై ఇన్‌స్టాలో శనివారం వీడియో పోస్ట్ చేసింది. ఇదే తన చివరి పోస్ట్ కావొచ్చని పేర్కొంది. ఆదివారం ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.