వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూపకల్పన కోసం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ నేటి నుండి ముందస్తు సమావేశాలు నిర్వహించనున్నారు. పరిశ్రమలు, మౌలిక వసతులు, వాతావరణ మార్పులపై ఆయా రంగాల అధిపతులు, ఇతర భాగస్వామ్యులతో సమావేశం కానున్నారు. వ్యవసాయం, ఆర్థిక రంగం, స్టాక్ మార్కెట్లు, వాణిజ్యం, ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్య రంగాల ప్రముఖులతో ఆమె రేపు సమావేశం కానున్నారు.