మాహారాష్ట్ర గవర్నర్ పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఛత్రపతి శివాజీని ఓ పాతవిగ్రహం అంటూ అభివర్ణించిన గవర్నర్ భగత్ సింగ్ కొశారీని వెంటనే రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. మరాఠా ప్రజల మనోభావాలు దిబ్బతీసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. సీఎం ఏక్ నాథ్ షిండే ఆయన్ను వెనకేసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వెంటనే మరాఠా ప్రజలకు క్షమాపణలు చెప్పి గవర్నర్ ను తొలగించాలని డిమాండ్ చేశారు.