55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పెందుర్తి శాఖ గ్రంధాలయంలో ఆదివారం వారోత్సవాల ముగింపు సభ మరియు బహుమతి ప్రధానోత్సవం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో కొల్లి వెంకటరావు పాల్గొని గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు విద్యార్థులందరూ గ్రంథాలయాన్ని వినియోగించుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి సత్యనారాయణమూర్తి పాల్గొని పుస్తకాలు చదవడం వల్ల జ్ఞాన సంపద పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ వడ్డాది ఉదయకుమార్, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు పత కంశెట్టి భూలోక, కార్యదర్శి ఆడారి రామకృష్ణ కమిటీ మెంబర్ సూరిశెట్టి లక్ష్మీ గణేష్ విశ్రాంత ఉపాధ్యాయులు దాసరి సత్యం మాస్టర్ గ్రంథాలయ సిబ్బంది లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు గెలుపొందిన విజేతలు వారి తల్లిదండ్రులుపాల్గొన్నారు.