ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పుర్‌లో దారుణం జరిగింది. ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న ఆశిశ్ తన సహోద్యోగ యువతిని గొంతునులుని హతమార్చాడు. మృతదేహాన్ని కారు డిక్కీలో దాచిపెట్టాడు. యువతి కుటుంబీకుల ఫిర్యాదు మేర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాల్ డేటా ఆధారంగా ఆశిశ్ ను విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు. మృతదేహం కుళ్లిపోయిందని, యువతి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు