చావ్లా సామూహిక అత్యాచారం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సోమవారం ఆమోదించారు. 2012 ఫిబ్రవరిలో 19 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశారు. ఆపై చంపేశారు. 2014లో ముగ్గురు నిందితులకు ఈ కేసులో మరణశిక్ష పడింది. అయితే వారిని నిర్దోషులుగా పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఢిల్లీ సర్కారు రివ్యూ పిటిషన్ దాఖలు చేయనుంది.