ఫిఫా వరల్డ్ కప్-2022 ప్రస్తుతం ఖతార్‌లో జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ ప్రేమికులు ఖతార్‌కు చేరుకుంటున్నారు. ఇక ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరిగే ప్రాంతాల్లో బీర్ల విక్రయాలపై ఖతార్ నిషేధించింది. దీంతో స్టేడియాలకు వచ్చిన ప్రేక్షకులకు తమకు బీర్లు కావాలంటూ నినాదాలు చేస్తున్నారు. "క్వెరెమోస్ సెర్వేజా (మాకు బీర్ కావాలి)" అని బిగ్గరగా ఆదివారం మ్యాచ్‌లో పలుమార్లు అరిచారు. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఖతార్‌పై ఈక్వెడార్ 2-0తో గెలిచింది.