నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరులో.. గిరిజనుడు దాసరి వెంకటేశ్వర్లు మరణంలో కుట్ర దాగి ఉందని టీడీపీ నేత వర్ల రామయ్య, జాతీయ ట్రైబల్ కమిషన్, డీజీపీకి లేఖ రాశారు. వెంకటేశ్వర్లు హైటెన్షన్ విద్యుత్ లైన్ల మరమ్మతులు చేస్తూ మరణించారన్నారు. వెంకటేశ్వర్లును హత్య చేసేందుకు షిఫ్ట్ ఆపరేటర్ చంద్రశేఖర్‌రెడ్డి.. పొంగూరు సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి కుట్ర పన్నినట్లు తెలుస్తోందన్నారు. 304ఏ సెక్షన్ కింద నిర్లక్ష్యం కారణంగానే వెంకటేశ్వర్లు చనిపోయాడని వర్ల రామయ్య పేర్కొన్నారు.