పర్చిమా గోదావరి జిల్లా, వీరవాసరం మండలం, బుదారాయుడు చెరువు వద్ద వీరవల్లిపాలెం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పాతకక్షల నేపథ్యంలో పేరుపాలెం బీచ్‌లో కడలి కనక శ్రీనివాస్ అనే వ్యక్తిపై అతని స్నేహితులు ఏడుగురు దాడి చేశారు. గాయాల పాలైన శ్రీనివాస్‌ను బంధువులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో శ్రీనివాస్‌ను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.