తెలుగు సినిమా హీరో, మెగాస్టార్ చిరంజీవి ని ఏపీ గవర్నర్ బిష్వభూషణ్ హరిచందన్ అభినందించారు. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ 2022 పేరుతో చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం ప్రకటన పట్ల అభినందనలు తెలియజేశారు. భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారాన్ని మెగాస్టార్ అందుకోనున్నారు. చిరంజీవి నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎంతో సేవ చేశారని కొనియాడారు. 150కి పైగా చిత్రాల్లో నటించిన చిరంజీవి ఇలాంటి మరిన్ని అవార్డులు అందుకోవాలని గవర్నర్ బిష్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa