మహారాష్ట్రలోని జల్నా జిల్లా పింపల్ గావ్ లో దారుణం జరిగింది. ఓ వివాహితకు మత్తు మందు ఇచ్చి రవి దత్తాత్రేయ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీన్ని ఫోన్ లో రికార్డు చేసి వీడియోను ఆమె భర్తకు పంపించాడు. దీన్ని చూసిన ఆమె భర్త మనస్తాపానికి గురై విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులతో పాటు ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.