ఫిఫా వరల్డ్ కప్-2022లో ఖతార్ వేదికగా జరుగుతున్న ఫుట్ బాల్ మ్యాచ్‌లు ఉత్కంఠను పంచుతున్నాయి. గ్రూప్-ఏ లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో సెనెగల్‌పై 2-0 తేడాతో నెదర్లాండ్ జట్టు విజయం సాధించింది. నెదర్లాండ్ తరుపున డేవీ క్లాసెన్, కాడీ గక్పో చెరో గోల్ సాధించి నెదర్లాండ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. సెనెగల్ గోల్ కీపర్ ఎడ్వర్డ్ మెండీ చేసిన తప్పిదాలతో ఆ జట్టు పరాజయం పాలైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa