చిలమత్తూరు మండలంలోని ప్రజలు కార్తీక మాస చివరి సోమవారం కావడంతో భక్తులు ఉదయం నుంచే శివాలయాల్లో కిటకిటలాడారు. కొడికొండలోని పంచనందీశ్వరాలయం, మండల కేంద్రంలోని రామలింగేశ్వరాలయం, బ్రహేశ్వరం పల్లిలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వ్రతాలు చేస్తున్న మహిళలు, యువతులు ఆలయాలకు వచ్చి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ముందుగా ఆలయాల్లో శివలింగాలకు ప్రత్యేక అలంకరణ, పంచామృత, రుద్రాభిషేకాలు, అర్చనలను అర్చకులు నిర్వహించారు.