జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్చార్టి దేవగుడి భూపేష్ రెడ్డి జమ్మల మడుగు మండలం దానవుల పాడు పంచాయతీ పరిధిలోని, శేషారెడ్డి పల్లె గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటగా ఆ గ్రామ రామాలయమును సంద ర్శించి పూజ చేసి టెంకాయ కొట్టిన అనంతరం ఆ గ్రామంలోని ప్రతి ఇంటికి యువకులు, మహిళలు, నాయకులతో కలిసి వెళ్లి వైసీపీ అరాచకాలను, విస్మరించిన హామీలను వివరించారు. సైకో ప్రభుత్వం పోయి సైకిల్ ప్రభుత్వం రావాలంటే రానున్న సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి జమ్మలమడుగులో తనను ఎమ్మెల్యే గాను, చంద్రబాబుని ముఖ్య మంత్రిగా గెలిపించాలన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణారెడ్డి, జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు నాగేశ్వర్ రెడ్డి, కిరణ్ రాయల్, చిన్న గురువి రెడ్డి, గురు శేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వెంకటరెడ్డి, పుల్లారెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, సుబ్బారెడ్డి, ముని రెడ్డి, పెద్ద ఓబుల్ రెడ్డి, గురుశేఖర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, సరస్వతి, సురేష్, అనిల్, స్వరూప్, సత్యం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.