ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ మతి మరుపు సమస్య కనిపిస్తోంది. అయితే తులసి, బాదం, నల్ల మిరియాలతో జ్ఞాపక శక్తిని పెంచుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 5 నుంచి 10 తులసి ఆకులు, 5 బాదం, 5 నల్ల మిరియాలు తేనెతో కలిపి తినడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని చెబుతున్నారు. అంతే కాకుండా ప్రతి రోజూ ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి జ్ఞాపక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు.