నూతన సంవత్సరం సందర్భంగా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. జనవరి నుంచే ఉద్యోగులకు పెరిగిన డీఏ వర్తించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఎప్పటి నుంచో ఉద్యోగులు పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. కాగా, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కోసం ఉద్యోగులు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వచ్చే ఏడాదిలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను ప్రభుత్వం గిఫ్ట్‌గా ఇచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.