ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జైలులో మసాజ్ చేసిన వ్యక్తి కూడా ఖదీయే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 22, 2022, 07:51 PM

ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన తీహార్ జైలులో మంత్రికి మసాజ్ సీన్ లో ఆసక్తికర కోణం వెలుగులోకి వచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణలతో జైలుపాలైన ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ తీహార్ జైల్లో హాయిగా మసాజ్ చేయించుకుంటున్న వీడియో ఇటీవల లీక్ కావడం తెలిసిందే. సత్యేంద్ర జైన్ మంచంపై పడుకుని విశ్రాంతి తీసుకుంటుండగా, ఓ వ్యక్తి ఆయనకు మసాజ్ చేస్తూ కనిపించాడు. 


అయితే, ఆ మసాజ్ చేసిన వ్యక్తి ఎవరన్నది తాజాగా వెల్లడైంది. ఆ వ్యక్తి కూడా జైలు ఖైదీయే. అతడు కన్నకూతురిపైనే అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతడి పేరు రింకూ. 10వ తరగతి చదువుతున్న కూతురిని రేప్ చేశాడంటూ అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. గతేడాది అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాంటి వ్యక్తితో ఆప్ మంత్రి జైల్లో మసాజ్ చేయించుకోవడం పట్ల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాజ్ క్షమాపణలు చెప్పాలని, మంత్రి సత్యేంద్ర జైన్ ను ఇకపై ఒక్క నిమిషం కూడా క్యాబినెట్ లో కొనసాగించరాదని బీజేపీ డిమాండ్ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com