ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం శ్రీకుళం జిల్లాలో పర్యటించనున్నారు. నరసన్నపేటలో సభకు హాజరై, అక్కడ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష రెండో విడత కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. లబ్ధిదారులకు వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీ సర్వే) పత్రాలను సీఎం పంపిణీ చేయనున్నారు. నరసన్నపేటలోని గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో సభ జరగనుంది.