టీడీపీ.. తెలుగు బూతులు, తెలుగు దొంగలు, తెలుగు డ్రామాలు, తెలుగు వెన్నుపోటుదారుల పార్టీ కాదా..? చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల తరువాత బట్టలూడిపోయిన చంద్రబాబు.. పబ్లిక్ మీటింగ్‌లలో ప్రజలను బట్టలూడదీసి కొడతానని మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. వీకెండ్లో ఏపీకి వచ్చి వెళ్లిపోయే ప్యాకేజీ కల్యాణ్‌ది సైకో సేన అని, వీధి రౌడీలు, అర్ధరాత్రి సంచరించేవారు, పిక్ పాకెట్‌గాళ్లను ఈ సైకో కల్యాణ్ తయారు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు.