దశలవారీగా రాష్ట్రంలోని భూముల రీసర్వే పూర్తి, రీసర్వే పూర్తయిన గ్రామాల్లో అవసరమైన ప్రక్రియను పూర్తిచేసి ఆయా గ్రామ సచివాలయాల్లో స్ధిరాస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020 డిసెంబర్ 21న ‘‘వైయస్‌ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకాన్ని’’ ప్రారంభించింది. భూ వివాదాలకు ఇక చరమగీతం, భూ లావాదేవీలు ఇకపై సులభతరం, వివాద రహితం, ప్రభుత్వ హమీతో కూడిన శాశ్వత భూమి హక్కు పత్రం. మీ భూములు, మీ ఆస్తులు ఇక సురక్షితం. వంద సంవత్సరాల తర్వాత దేశంలోనే తొలిసారిగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వేలో భాగంగా, 2వేల గ్రామాల రైతులకు జగనన్న భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమం, రాబోయే 15 రోజులలో ఈ 2వేల గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో (23.11.2022) ఈ కార్యక్రమంలో సీఎం శ్రీ వైయస్ జగన్ పాల్గొననున్నారు.