పెట్రోల్ పంపు వద్ద ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లో జరిగింది. సిహానిగేట్ ఏరియా పాత బస్టాండ్ సమీపంలోని పెట్రోల్ పంపు వద్ద ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ గొడవకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. విచారణ అనంతరం అవసరమైన చర్యలు తీసుకోవాలని సిహానిగేట్ ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ ను ఆదేశించినట్లు ఘజియాబాద్ పోలీసులు ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే ఇరువర్గాల మధ్య గొడవ ఎందుకు జరిగింది అనే దానిపై కారణాలు తెలియరాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa