ఇండోనేసియాలోని జావా ద్వీపంలో రెండ్రోజుల క్రితం భారీ భూకంపం సంభవించిం విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 271కి చేరింది. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను సహాయసిబ్బంది బయటకు తీస్తున్నారు. ఇందుకోసం సుమారు 12,000 మంది సైనికులను రంగంలోకి దించారు.
ఈ క్రమంలో శిథిలాలను తీస్తుండగా తన అమ్మమ్మ మృతదేహం పక్కనే సజీవంగా ఉన్న ఓ ఆరేళ్ల బాలుడిని సిబ్బంది గుర్తించారు. అతడు సజీవంగానే ఉన్నాడని తెలుసుకుని హుటాహూటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా సహాయక చర్యల విషయంలో ప్రభుత్వ స్పందన తగిన రీతిలో లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.