చలికాలంలో వేడిగా ఆహార పదార్థాలు తినాలని అందరికీ ఉంటుంది. దీంతో వండిన పదార్థాలనే మళ్లీ వేడి చేసుకుని తినడం చాలా మందికి అలవాటు. అయితే అలా తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకసారి వండిన అన్నాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల అందులోని బ్యాక్టీరియా ట్యాక్సిన్లను విడుదల చేస్తుందని, ఫలితంగా అన్నం విషపూరితంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. అలాగే క్యారెట్లు, ఆకుకూరలు, చికెన్, మష్రూమ్ వంటి వాటిని మళ్లీ వేడి చేయడం వల్ల పోషకాలు నశిస్తాయని చెబుతున్నారు.