తమిళనాడులో బుధవారం దారుణం జరిగింది. వేరే కులం వ్యక్తిని ప్రేమించిందనే ఆగ్రహంతో ఓ మహిళ తన కూతుర్ని కొట్టి చంపింది. తిరునల్వేలి జిల్లాలోని సివల్పేరి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన ఆరుముగ కని, పిచ్చయ్ దంపతుల కూతురు అరుణ అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. ఆ యువకుడు వేరే కులం వాడు కావడంతో వారి ప్రేమకు అరుణ తల్లి అడ్డుచెప్పింది. బుధవారం అరుణకు వేరే వ్యక్తితో పెళ్లిచూపులు ఏర్పాటు చేయగా, అరుణ అందరి ముందే తన ప్రేమ వ్యవహారం గురించి చెప్పింది. దీంతో పెళ్లిచూపులు రద్దయ్యాయి. దీంతో ఆగ్రహానికి గురైన అరుణ తల్లి అరుణను చంపి, తానూ ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.