భారతదేశపు అతిపెద్ద ప్యాకేజ్డ్ వాటర్ మేకర్ బిస్లెరీ ఇంటర్నేషనల్‌ను టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ కొనుగోలు చేయనుంది. బిస్లరీ కంపెనీ చైర్మన్ రమేష్ చౌహాన్ వ్యాఖ్యలని ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. బిస్లరీ ఆవిష్కర్త రమేశ్ చౌహాన్ బిస్లరీని టాటా సంస్థకు రూ. 7వేల కోట్లకు విక్రయించనున్నారు. ఒప్పందంలో భాగంగా ప్రస్తుత నిర్వహణ రెండేళ్ల పాటు కొనసాగనుంది. కుమార్తె జయంతి వ్యాపారంపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో 82 ఏళ్ల చౌహాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. బిస్లరీ విక్రయం బాధాకరమైన నిర్ణయమే అయినప్పటికీ టాటా గ్రూప్ మరింత అభివృద్ది చేసి, ఇంకా బాగా చూసుకుంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.